Monday 22 October 2012

Telangana, is a region in the present state of Andhra Pradesh, India and formerly was part of Hyderabad State


Bonalu, Bathukamma, Diwali, Vijayadashami, Eid-ul-Fitr, Eid al-Adha, Moharram, Milad un Nabi, Christmas, Sri Rama Navami, Vinayaka Chaviti, Tholi ekadasi, Sammakka Saralamma, Mahashivarathri, Varalaxmi Vratam, Nagula Panchami, Nagula Chavithi, Sri Krishnastami and Ugadi are prominent festivals in Telangana. Other festivals of Hindus and Muslims such as Holi, Raksha Bandhan, Eid-ul-Fitr and Milad un Nabi are also celebrated with equal enthusiasm as in rest of India. The Sankranti festival is celebrated at the beginning of harvest season, generally, on January 14 every year. Bathukamma and Bonalu are regional festivals of Telangana.

Bathukamma is a festival celebrated by the Hindu women.. of Telangana region in Andhra Pradesh, India. It is followed by Boddemma which is 7 days festival. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is celebrated for nine days during Durga Navratri.[1][2] It starts on the day of Mahalaya Amavasya. It concludes two days before Dussera called as Durgashtami. On the final day, the closing ceremony of Bathukamma panduga is celebrated as a great festival – Pedda Bathukamma or Saddula Bathukamma.

Bathukamma is a beautiful flower stack, arranged with seasonal flowers, in seven concentric layers, of potter’s clay like a cone. Bathuku in Telugu means live/life, and Amma means mother, hence Bathukamma, is celebrated for the glory, later denoted as Goddess Gauri - the patron Goddess of womanhood.[



బతుకమ్మ పండగ 



- తెలంగాణ ప్రాంతంలో మార్మోగే బతుకమ్మ
- తెలంగాణ సంస్కృతికి ప్రతీక
- ప్రపంచంలోనే అరుదైన పండగ బతుకమ్మ


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

              



 కొన్ని పండగలకు తరతరాల చరిత్ర ఉంటుంది. మరికొన్ని పండుగలు ప్రజల సంబరాల నుంచి పుట్టుకువస్తాయి. ఆటాపాటలతో, ఆనందంతో ప్రజలు తమ సంతోషాన్ని పంచుకునే పండుగల్లో బతుకమ్మ పండగ అతిముఖ్యమైనది. ప్రపంచంలో మరెక్కడలేని అరుదైన పండుగ.... తెలంగాణ ప్రాంతమంతా మార్మోగే సంబరం బతుకమ్మ పండుగ.... తెలంగాణ ప్రాంతంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పండగ బతుకమ్మ.... రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మతో, సీతాకొకచిలుకల్లా పోటీలు పడేలా అందంగా అలంకరించుకున్న ఆడపిల్లలు తమ సంతోషాన్ని, బాధలను బాణీకట్టి వినిపించే పాటలతో, పాటకు అనుగుణంగా లయబద్ధంగా కదిలే అడుగుల ఆటలతో సాగే జాతర బతుకమ్మ పండుగ.... ఊరు-వాడ, గొప్ప-పేద, పిల్లలు-వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా కలిసి సంబరంగా చేసుకునే ఊరందరి సమష్టి పండుగ బతుకమ్మ.... తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ పండగ కథను, నేపథ్యాన్ని, ఆడే విధానానికి, పాటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

బతుకమ్మ పండుగకు అనేక కథలు...ఈ పండుగకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కాగా, లయకారుడు పరమశివుని అర్థాంగి, జగన్మాత అయిన పార్వతీదేవీయే బతుకమ్మ అన్న విశ్వాసం మన పూర్వికుల నుంచి వాడుకలో ఉంది. పార్వతీదేవి తన పుట్టింటి నుంచి కబురు రాకున్నా తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అవమానింపబడిందని, తర్వాత యాగాగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుందని, ఆమె ప్రాణత్యాగం చేయటం చూసి సహించలేని ప్రజలు, భక్తులు ముక్తకం ’బతుకమ్మ, బతుకమ్మ’ అంటూ హృదయవిదారకంగా విలపిస్తూ, భక్తితో పాటలు పాడగా పార్వతీదేవి ప్రత్యక్షమైందని, అప్పటి నుంచి ప్రజలు బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారని ఒక కథ ప్రచారంలో ఉంది. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే వారికి ’బతుకమ్మ’ అనే పేరు పెట్టే ఆచారం ఈనాటికి తెలంగాణ ప్రాంతంలో ఉంది. బతుకమ్మ అన్న ఆ జగన్మాత పేరు పెడితే ఆ పిల్లలు బతుకుతారన్న గట్టి నమ్మకం ఈనాటికి ప్రజల్లో ఉంది.

బతుకమ్మ సంబరాలు.....
బతుకమ్మ పండగ రోజు మగవారంతా పొలాలకు వెళ్లి తంగేడి, గునుక పూలను తీసుకువస్తారు. తర్వాత ఇంటిల్లిపాది కూర్చుని ఆ గునుగపూలు, తంగేడి, కలువ, ఇతర రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఈ పూలన్నింటిని జాగ్రత్తగా ఒక తాంబలంలో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు తాంబలంలో పేర్చుతారు. తర్వాత తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుకల పూలను రంగులతో అద్ది, మధ్యలో తంగేడి పనులను పెడతారు. పేర్చటం అయిపోయాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి, చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని ఇంట్లోని దేవాలయం వద్ద పెట్టి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మల చుట్టు తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలు ధరించి, కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాకా మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తర్వాత ఇంటి నుంచి తీసుకువచ్చిన ప్రసాదాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు.


బతుకమ్మ పండుగ విశిష్టత.....


వర్షరుతువు చివరి దశలో తెలంగాణ ప్రాంతంలో విరబూసిన తంగేడు పూలతో పసిడి పరికిణిని చుట్టుకుని, గట్టు
పూసే గునుగుతో వెండి అంచులు దిద్దుకుని సింగారించుకున్న పల్లెపడుచులా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలుగులు పారే చెరువులు, కుంటలు నిండుగా తొణికిసలాడతాయి. పూరిగుడిసెలు సైతం పందిరి మీద పొదుల మీద, పెరట్లో విరగబూసిన బీరపూలు, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో బంగారు అద్దినట్లు, రంగురంగుల హరివిల్లుగా కన్నుల నిండుగా కనిపిస్తాయి. విశ్వకర్మ నిర్మించిన అందమైన భవనాల్లో ఎక్కడ కనిపించని ప్రకృతి అందాలు ఈ పూరిగుడిసెల్లో దాగి ఉన్నాయా అన్నంత అపురూపంగా కనిపిస్తాయి. ఏడురంగుల ఇంద్రదనస్సు నేలకు దిగి వచ్చి పొలం గట్ల వెంట పాకినట్లు రంగురంగుల పూలు కనిపిస్తాయి. ప్రకృతి శోభ పండుగలో ప్రతిబింబిస్తుంది. పూలు కోసుకువచ్చే వంతు మాత్రమే మగవారిది. ఇక హడావుడి అంతా ఆడవారిదే. తెలంగాణ సంస్కృతికి వైభవానికి ప్రతీకగా జరిపే బతుకమ్మ పండగను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. దేవీ నవరావూతులతో పాటు అత్యంత భక్తిక్షిశద్ధలతో సాగుతుంది. మహాలయ పక్ష అమావాస్య రోజున మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి ఆ తెల్లవారి నుంచి ప్రతీ రోజు సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడుచులు కన్నుల పండుగగా తొమ్మిది రోజులు రంగురంగుల పూల హరివిల్లుగా బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు.

చివరి రోజు (దుర్గాష్టమి నాడు) పెద్దగా పేర్చిన బతుకమ్మను ఇంటి ఎదుట వాకిళ్లలో, వీధిలో, కూడలిలో ఉంచి ఆడపడుచులంతా కలిసి సామూహికంగా పాటలు పాడుతూ, లయబద్ధంగా చేతులు కలుపుతూ, అడుగులో అడుగు వేస్తూ బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ పాటలన్నింటిలోనూ లక్ష్మీదేవి, గౌరమ్మ, బతుకమ్మ, పార్వతీ, శివుడు, అత్తవారింట్లో ఆడపిల్ల నడుచుకోవల్సిన తీరు తదితర ఇతివృత్తాలే ఎక్కువగా ఉంటాయి. జామురాతిరి దాక ఆడి చివరికి బతుకమ్మను చెరువులో, వాగులో నిమజ్జనం చేస్తారు. ముత్తెదువలు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇంటి నుంచి తెచ్చిన సద్దులు అందరికి పంచుతారు. ఊరంతా చెరువు గట్టుకు తరిలివచ్చిందా అన్నట్లుగా బతుకమ్మ సంబరాలు సాగుతాయి

Bathukamma Songs:


http://www.youtube.com/watch?v=XXyB8-UPd30

http://www.youtube.com/watch?v=sT1ex_ErhIk